బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే నితీష్ కుమార్ (Nitish Kumar) ను రాష్ట్రపతి అభ్యర్థి గా ప్రకటిస్తారని ఆశిస్తున్న తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నితీష్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను కూడా ఏదో ఒక సమయంలో రాజ్యసభ సభ్యునిగా ఉండాలని కోరుకుంటన్నానని చెప్పారు.
దీంతో ఆయన చేసిన కామెంట్స్ దేశంలో కలకలం రేపాయి. రాజకీయ వర్గాలలో ఈ కామెంట్స్ చర్చకు దారి తీశాయి. ఇదిలా ఉండగా 2020 బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ వరుసగా రెండో సారి గెలిచారు.
భారతీయ జనతా పార్టీ (BJP)తో పొత్తు కుదురదని భావిస్తున్న సీఎం రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. బీహార్ (Bihar) లో ఇద్దరు సమకాలీనులు, ఉద్దండ రాజకీయ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్ , సుశీల్ మోడీ ఉన్నారు.
శరద్ యాదవ్ ఇటీవలే తన పార్టీని విలీనం చేశారు. కాగా తాను కూడా ఏదో ఒక సమయంలో రాజ్యసభ సభ్యునిగా ఉండాలని కోరుకుంటున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే సీఎం నితీశ్ కుమార్ ఇప్పటి దాకా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్సీగా, లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీహార్ సీఎంగా నితీష్ కుమార్ పని చేస్తున్నారు.
16 ఏళ్లుగా సుదీర్ఘ కాలం పాటు సీఎంగా ఉన్నారు. కొత్త పాత్ర కోసం వెతుకుతున్నట్లు భారీ ఊహాగానాలకు దారి తీసింది. మరికొద్ది రోజుల్లో ఖాళీ అయ్యే ఉప రాష్ట్రపతి పదవి రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.