Supreme Court : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ లఖింపూర్ ఖేరి కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది భారతదేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు(Supreme Court ). ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఆయన బెయిల్ ను రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ రిటైర్డ్ జడ్జి కమిటీ యూపీ సర్కార్ కు లేఖ రాసింది.
ఈ లేఖ ఇప్పుడు కలకలం రేగింది రాష్ట్రంలో. బాధిత రైతుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి యూపీ ప్రభుత్వాన్ని సదరు జడ్జి ప్రతిపాదనలపై స్పందించాలని స్పష్టం చేసింది.
ఇందుకు గాను ఏప్రిల్ 4వ తేదీ లోపు గడువు విధించింది. దీంతో కొత్తగా రెండోసారి కొలువు తీరిన యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ కు షాక్ ఇచ్చినట్టేనని భావించవచ్చు.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన రైతులపై కారును పోనిచ్చాడని ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో గత నెల ఫిబ్రవరి 10వ తేదీన అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ బాధిత కుటుంబాలు కోర్టు ను ఆశ్రయించడంతో సీజేఐ విచారణ చేపట్టారు. ఎన్వీ రమనతో పాటు సూర్యకాంత్, హిమా కోహ్లీ కూడా విచారణ చేస్తున్నారు.
కాగా ఆశిశ్ మిశ్రాకు బెయిల్ ఎందుకు రద్దు చేయడకూదో వివరించాలంటూ నోటీసులు జారీ చేసింది.
Also Read : ఆర్యన్ కేసు..గడువు కోరిన ఎన్సీబీ