పాకిస్తాన్ (Pakistan) ప్రధాన మంత్రి (PM) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రతిపక్షాలు ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. ఈ మేరకు ఇవాళ తాడో పేడో తేలనుంది.
ఈ తరుణంలో పాకిస్తాన్ (Pakistan) పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పాకిస్తాన్ మాజీ ప్రధాని అంటూ పేర్కొన్నారు.
ప్రభుత్వానికి సరిపడినంతా బలం లేదని, ఇప్పటికే తన పార్టీకి చెందిన 25 మంది తప్పుకున్నారని, మిత్ర పక్షానికి చెందిన 23 మంది గుడ్ బై చెప్పేశారని తెలిపారు.
ఈ తరుణంలో ఆయన ఒక్క క్షణం ప్రధానిగా (PM) ఉండేందుకు అర్హుడు కాడంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు పాకిస్తాన్ తెహ్రీక్ యి ఇన్ సాఫ్ పార్టీ – సీనియర్ నాయకుడు ఫైజల్ వర్ణా (Faisal Vawda) .
దేశ వ్యాప్తంగా కలకలం రేగాయి. ఎవరు కుట్ర పన్నారనేది త్వరలో తేలుతుందన్నారు. ప్రాణ హాని ఉండడం వల్లనే ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించ లేక పోయారని ఆరోపించారు.
కుట్ర నిజమని ఆయనను చంపడం ఖాయమని మండిపడ్డారు. పాకిస్తాన్ (Pakistan) రాజకీయాలను శాసించాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి.
అందులో భాగంగానే పాకిస్తాన్ ప్రధానిని వారు టార్గెట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను ఖతం చేయాలన్న సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు తమ ప్రభుత్వానికి విన్నవించాయని చెప్పారు.
ఇదిలా ఉండగా బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ తో పాటు భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.