Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీకి (BJP) చెందిన శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఇవాళ ఆయన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ భక్తి అన్నది బీజేపీకి పేటెంట్ కాదని గుర్తుంచు కోవాలని అన్నారు. ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు.
మతం పేరుతో, సినిమా పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. దేశం భవిష్యత్తు లో కీలక పాత్ర పోషించాల్సిన యువతను పెడదోవ పార్టీ పట్టిస్తోందంటూ ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ). ఇలాంటి గూండాయిజానికి పాల్పడవద్దని పేర్కొన్నారు.
దేశం కోసం తాను చని పోయేందుకు సిద్దంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. దేశ భక్తులు అయితే ఇలాంటి సంఘ విద్రోహ పనులు చేయరని అన్నారు.
తన నివాసంలో విధ్వంసానికి పాల్పడడంపై సీరియస్ గా స్పందించారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కోర్టును ఆశ్రయించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అంతం చేసేందుకు బీజేపీ (BJP) కుట్ర పన్నుతోందని సంచలన ఆరోపణలు చేసింది. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేజ్రీవాల్ (Kejriwal) ముఖ్యం కాదు. దేశం ముఖ్యం. దేశం కోసం చని పోయేందుకు తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. బీజేపీ యువతకు తుపాకీ వాడడంలో శిక్షణ ఇస్తోందంటూ ఆరోపించారు. ఇది దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : సామాజిక చైతన్య స్ఫూర్తి ప్రదాతల మాసం… ఏప్రిల్