Rahul Gandhi : తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (Congress) పటిష్టతపై ఏఐసీసీ ఫోకస్ పెట్టింది. ఇందులో పార్టీకి సంబంధించి కార్యాచరణను ఖరారు చేసేందుకు ప్లాన్ చేయనుంది. ప్రధానంగా రాష్ట్ర సమస్యలపై ఆరా తీశారు అగ్ర నేత రాహుల్ గాంధీ.
రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన పార్టీ నేతలతో ఏప్రిల్ 4న సమావేశం కానున్నారు. ముఖ్య నేతలతో ఆయన మీట్ అయ్యారు. ఈ కీలక సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ , జానా రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధు యాష్కి, గీతా రెడ్డి, మహేష్ కుమార్ , అంజన్ కుమార్ , రాజ నరసింహ, పొన్నాల, బల రాం నాయక్, అజహరుద్దీన్ , షబ్బీర్ అలీ, వేణు గోపాల్ హాజరయ్యారు.
రాష్ట్రంలో పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయింది. ప్రతి కార్యకర్తకు రూ. 2 లక్షల ప్రమాద జీవిత బీమా సౌకర్యం కల్పించనుంది. ప్రీమియం చెక్కును రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేతుల మీదుగా బీమా కంపెనీకి అందజేశారు.
ఈనెల 4న సమావేశం నిర్వహించాలని సీనియర్ కాంగ్రెస్ (Congress) నాయకుడు కేసీ వేణుగోపాల్ కు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సూచించారు. సీనియర్లు మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వాలంటూ గీతారెడ్డి కోరడం విశేషం.
ఆరోజు జరిగే పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ప్లాన్ చేయనున్నారు. రైతులు, నిరుద్యోగ సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్లాలని అనుకుంటోంది పార్టీ.
ఏప్రిల్ ఒకటి తర్వాత రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై పోరాడేందుకు ముందుకు వెళతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ సారథ్యంలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
Also Read : రైతుల వెతలకు ఆ పార్టీలే కారణం