Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకు పోతున్నారు. పాలనా పరంగా తనదైన ముద్రను కనబరుస్తూ పారద్శకత ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
ఈ తరుణంలో భగవంత్ మాన్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జైళ్లను సంస్కరణ కేంద్రాలుగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
జైళ్ల పరిపాలనలో విస్తృతమైన సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసందని ఉందని స్పష్టం చేశారు భగవంత్ మాన్(Bhagwant Mann). జైళ్ల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం చేపట్టారు.
ఈ సందర్బంగా జైళ్లు మార్పులకు కేంద్ర బిందువుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. మీరంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
నేరస్థుల పట్ల అనుసరించాల్సిన పద్దతులు, వారి పట్ల ఎలా వ్యవహరించాలనే దానిపై ఎక్కువగా దృష్టి సారించాలన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann).
తెలిసో తెలియకో జైలు శిక్ష అనుభవిస్తున్న నేరస్తులలో మానసిక పరివర్తన తీసుకు రావాల్సిన బాధ్యత సంబంధిత ఉన్నతాధికారులు, జైళ్లను నిర్వహిస్తున్న వారిపై ఉందన్నారు.
దీనిని మానవీయ కోణంతో అర్థం చేసుకోవాలంటూ సూచించారు భగవంత్ మాన్. హార్డ్ కోర్ క్రిమినల్స్ , గ్యాంగ్ స్టర్లు, డ్రగ్ బానిసలతో సహా ఖైదీలను ప్రధాన స్రవంతి లోకి తీసుకు వచ్చేందుకు వారిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
జైళ్లు చిత్రహింసలకు కేంద్రాలు కాకూడదని సంస్కరించే గృహాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. ఖైదీలందరినీ వారి సామాజిక హోదాతో సంబంధం లేకుండా ఒకేలా చూడాలని సూచించారు సీఎం.
Also Read : దేశం కోసం చని పోయేందుకు సిద్దం