Rajya Sabha Farewell : ఎంపీల సేవ‌లు ప్ర‌శంస‌నీయం – మోదీ

రాజ్యస‌భ ఎంపీల‌కు పీఎం, ఖ‌ర్గే వీడ్కోలు 

Rajya Sabha Farewell  : ఇవాళ అరుదైన స‌న్నివేశానికి వేదికైంది పార్ల‌మెంట్. ఒకేసారి 72 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు త‌మ ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌డంతో ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు.

ఈ కార్య‌క్ర‌మానికి దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నాయ‌కుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే (Rajya Sabha Farewell )ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఎప్పుడూ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకునే మోదీ, ఖ‌ర్గేలు ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ భావోద్వేగంతో మాట్లాడారు. మీరు ప్ర‌జ‌ల త‌రపున పెద్ద‌ల స‌భ‌కు రావ‌డం. వారి త‌ర‌పున ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ఇదే నిజ‌మైన ప్ర‌జాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు ప్ర‌ధాని. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ‌, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ తో స‌హా ..ప్ర‌తిఒక్క‌రికీ అభివాదం చేస్తూ క‌నిపించారు. మ‌ల్లికార్జున ఖ‌ర్గేతో ప్ర‌త్యేకంగా క‌ర‌చాల‌నం చేశారు.

ఇద్ద‌రూ చాలా సేపు మాట్లాడుకున్నారు. పీఎం ఖ‌ర్గేను ఉద్దేశించి స‌భ‌ను నెమ్మ‌దించి స‌భ‌ను అనుమ‌తించ‌మ‌ని కోరారు. ప్ర‌శ్న‌ల‌ను అడ‌గ‌డ‌మే త‌మ పార్టీ ప‌ని , పీఎం ఇందుకు జ‌వాబు దారీగా ఉండాల్సిందేనంటూ న‌వ్వులు పూయించారు.

ఎట్ట‌కేల‌కు ఇద్ద‌రూ న‌వ్వుకుంటూ వెళ్లి పోవ‌డం స‌భ హుందాత‌నాన్ని సూచించింది. ఈ ఏడాది మార్చి నుంచి జూలై వ‌ర‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన 72 మంది స‌భ్యుల‌కు రాజ్య‌స‌భ వీడ్కోలు(Rajya Sabha Farewell )ప‌లికింది.

వీరిలో ఏకే ఆంటోనీ, అంబికా సోని, చిదంబ‌రం, ఆనంద్ శ‌ర్మ‌, జైరాం ర‌మేష్ , సురేష్ ప్ర‌భు, ప్రపుల్ ప‌టేల్ , డాక్ట‌ర్ సుబ్ర‌మ‌ణ్యిన్ స్వామి, ప్ర‌స‌న్న ఆచార్య‌, సంజ‌య్ రౌత్ , న‌రేష్ గుజ్రాల్ , స‌తీష్ చంద్ర మిశ్రా, ఎంసీ మేరీ కోమ్ , స్వ‌ప‌న్ దాస్ గుప్తా ఉన్నారు.

Also Read : ఉపాధి హామీ ప‌థ‌కంపై నిర్ల‌క్ష్యం

Leave A Reply

Your Email Id will not be published!