Rakesh Tikait : యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిష్రా ప్రమేయం ఉందంటూ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయనకు అలహాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దీనిని సవాల్ చేస్తూ బాధిత రైతు కుటుంబాలు సుప్రంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం యూపీ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది.
ఎందుకు బెయిల్ ఇచ్చారనే దానిపై క్లారిటీ ఇవ్వాలంటూ కోరింది. ఈ మేరకు సిట్ జడ్జికి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో యూపీ సర్కార్ కు కోలుకోలేని షాక్ తగిలింది.
ప్రస్తుతం మంత్రి తనయుడు దర్జాగా బయట తిరుగుతుండడంతో బాధిత కుటుంబాలకు తమకు రక్షణ లేకుండా పోతుందని వాపోయింది.
వారి తరపున ప్రశాంత్ భూషణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో భారతీయ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్(Rakesh Tikait) సంచలన కామెంట్స్ చేశారు.
ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంత్రి కుమారుడిపై సిట్ నివేదిక పంపడాన్ని ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. సాక్ష్యాలను తారుమారు చేసినట్లు అందులో అంగీకరిచారు.
అయినా ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఎలా వచ్చింది. దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలి. ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. ఈరోజు వరకు క్షతగాత్రులకు పరిహారం అందలేదని వాపోయారు.
చట్టం – రాజకీయాల అనుబంధం ఎంత ఖచ్చితమో సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు రాకేశ్ తికాయత్.
Also Read : జైళ్లు సంస్కరణ కేంద్రాలు కావాలి