Sri Lanka Protest : శ్రీలంకలో పరిస్థితి చేయి దాటి పోతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతోంది. ఆకలి కేకలు ఆర్త నాదాలతో ఆ దేశం దద్దరిల్లుతోంది. ఈ తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే ఇంటి ముందు వేలాది మంది ఆందోళన చేపట్టారు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ ఇంటి ముందు జనం భారీ ఎత్తున నిరసన చేపట్టారు. తాము ఇబ్బందులు పడుతుంటే ఇంద్ర భవనంలో కూర్చుంటే ఎలా అని నిలదీశారు.
పెద్ద ఎత్తున ప్రెసిడెంట్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. శ్రీలంక రాజధాని కొలంబో ఇప్పుడు తీవ్ర సంకట స్థితిని(Sri Lanka Protest) ఎదుర్కొంటోంది.
రాజపక్సే కు పాలన చేత కాదని వెంటనే పదవి నుంచి దిగి పోవాలని డిమాండ్ చేశారు. 5 వేల మందికి పైగా ఒకస్కారిగా రాజ భవనంపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు.
అదుపు చేయ బోయిన పోలీసులపై నిప్పులు చెరిగారు. దీంతో ఖాకీలు మిన్నకుండి పోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులను అణిచి వేసేందుకు పారా మిలటరీ పోలీస్ యూనిట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మిరిహానా, నూగెగూడలో జరిగిన నిరసనల నేపథ్యంలో45 మందిని అదుపులోకి తీసుకున్నారు. పలువురు పోలీసులు ఆందోళనకారుల దెబ్బకు గాయపడ్డారు.
రెచ్చి పోయిన నిరసనకారులు పోలీసు బస్సు, పోలీసు జీపు, 2 మోటార్ బైక్ లను దగ్దం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత ఘోరమైన ఆర్థిక మాంద్యంతో(Sri Lanka Protest) పోరాడుతోంది శ్రీలంక.
వారాల కొద్దీ ఆహారం, అవసరమైన వస్తువులు, ఇంధనం, గ్యాస్ కొరత తీవ్రంగా నెలకొంది. దీంతో జనం బయటకు వచ్చారు. రాజపక్సే దిగి పోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read : ఇమ్రాన్ ఖాన్ హత్యకు స్కెచ్