Imran Khan : పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉన్నది. ఆ దేశానికి వరల్డ్ కప్ తీసుకు వచ్చిన ఈ స్టార్ మాజీ కెప్టెన్ ఇప్పుడు ప్రత్యర్థులకు చెక్ పెట్టే పనిలో పడ్డారు.
ఎన్నడూ లేని రీతిలో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో పీటీఐకి చెందిన 25 మంది పార్టీని వీడారు. మిత్రపక్షాలకు చెందిన 23 మంది గుడ్ బై చెప్పారు.
ఆయనపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆయన విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. అయితే ఇప్పటి వరకు ఆ దేశంలో నో కాన్పిడెన్స్ మోషన్ ను ఎదుర్కోబోతున్న మూడో దేశ ప్రధాని కావడం విశేషం.
ఇదిలా ఉండగా తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదంటూ ప్రకటించాడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan). విదేశీ శక్తులతో పని చేస్తున్న ఆ ముగ్గురు దొంగలు ఎవరో బయట పెడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అయితే తనకు ప్రాణ హాని ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాయి. తాను తప్పుకునే ప్రసక్తి లేదన్నారు. చివరి క్షణం వరకు తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశాడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా విదేశీ కుట్ర జరుగుతోందంటూ ఆరోపించాడు. ఇదే సమయంలో కొన్ని విదేశాల నుంచి సందేశాలు కూడా వస్తున్నాయని తెలిపారు.
69 ఏళ్ల వయసు కలిగిన ఇమ్రాన్ ఖాన్ ఎట్టి పరిస్థితుల్లో తాను ఓటమి ఒప్పుకోనంటూ ప్రకటించాడు. తన భవిష్యత్తును దేశ ప్రజలే నిర్ణయిస్తారంటూ సంచలన కామెంట్స్ చేశాడు పాకిస్తాన్ ప్రధాన మంత్రి.
Also Read : ఇకపై ఇమ్రాన్ ఖాన్ పీఎం కాదు