Supreme Court : మహారాష్ట్ర సర్కార్ కు సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ తగిలింది. మాజీ హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ (Anil Deshmukh) పై సీబీఐ (CBI) విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఆయన కేసును రాష్ట్ర పరిధిలోకి బదిలీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు (Supreme Court)కొట్ట వేసింది. దీంతో మంత్రికి విచారణ తప్పదని తేలి పోయింది.
సీబీఐ (CBI) కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తమ మంత్రులను, నేతలను టార్గెట్ చేసేందుకు సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించు కుంటోందని ఆరోపించిన మహారాష్ట్ర (Maharastra) ప్రభుత్వానికి కోర్టు నిర్ణయం షాక్ తగిలింది.
అనిల్ దేశ్ ముఖ్ (Anil Deshmikh ) పై సీబీఐ చేపట్టిన అవినీతి నిరోధక శాఖ విచారణను కోర్టు పర్యవేక్షణలో ఉన్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి – సిట్ అప్పగించాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
మహారాష్ట్ర (Maharastra) మాజీ పోలీస్ చీఫ్ సుబోధ్ కుమార్ జైస్వాల్ ఇప్పుడు దర్యాప్తు సంస్థకు చీఫ్ గా ఉన్నందున సీబీఐ దర్యాప్తు పక్షపాతంగా సాగుతుందని మహారాష్ట్ర సర్కార్ తను సమర్పించిన పిటిషన్ లో పేర్కొంది.
ఆందోళన వ్యక్తం చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ (Congress) పార్టీ – ఎన్సీపీ సీనియర్ నాయకుడు అనిల్ దేశ్ ముఖ్ మహారాష్ట్ర హోం శాఖ మంత్రి గా ఉన్న సమయంలో పోలీసు బదిలీలు, పోస్టింగ్ ల కోసం లంచం తీసుకున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. జైస్వాల్ పోలీస్ స్థాపన బోర్డులలో భాగమని పేర్కొంది.
Also Read : బండబడ గ్యాస్ గుదిబండ