YS Jagan : ఇవాళ శుభకృత్ నాగ సంవత్సర ఉగాది పండుగ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారంతా వైభవంగా జరుపుకుంటున్నారు.
పర్వదినం పురస్కరించుకుని ఇటు తెలంగాణలో సీఎం కేసీఆర్ అటు ఏపీ రాష్ట్రంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అంతకు ముందు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడికి వచ్చిన చిన్నారులు, విద్యార్థులు, పేరెంట్స్ ను ఆప్యాయంగా పలకరించారు.
అనంతరం జగన్ రెడ్డిYS Jagan )జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు. పండితులు, అర్చకులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా పండితోత్తములు పంచాంగ శ్రవణం వినిపించారు.
ఈ వేడుకల్లో సీఎం దంపతులతో పాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరాయ సోమయాజి పంచాంగ శ్రవణం చేశారు. శుభకృత్ నామ సంవత్సరంలో ఈ సారి అంతా రాష్ట్రంలో మంచే జరుగుతుందని చెప్పారు.
సీఎం జగన్ రెడ్డికి (YS Jagan )మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు సాగుతుందన్నారు. పంచాంగం అనంతరం సిద్దాంతిని సీఎం జగన్ దంపతులు సన్మానించారు.
అనంతరం శారదా పీఠం తరపున సీఎం జగన్ కు వస్త్రాలు సమర్పించారు సిద్దాంతి.