Arvind Kejriwal : గుజరాత్ లో పర్యటిస్తున్న ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ శనివారం మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అంతకు ముందు ఆశ్రమంలో చరఖాలు నడిపారు. ఆశ్రమ నిర్వాహకులు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), భగవంత్ మాన్ లకు పుస్తకాన్ని బహూకరించారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే పంజాబ్ లో ఆప్ పవర్ లోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆప్ విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది చివర్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో ఇక్కడ పాగా వేసేందుకు ఆప్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. రెండు రోజుల టూర్ లో భాగంగా ముందుగా మహాత్ముడి ఆశ్రమాన్ని సందర్శించడంతో ప్రారంభించారు.
అనంతరం ఆశ్రమంలోని మహాత్ముడి మ్యూజియాన్ని సందర్శించారు. ఇదిలా ఉండగా భారత దేశ స్వాతంత్ర పోరాటంలో సబర్మతి ఆశ్రమం కీలకంగా వ్యవహరించింది.
ఆనాడు బ్రిటీష్ సాల్ట్ లాకు వ్యతిరేకంగా చారిత్రాత్మక దండి మార్చ్ ను ఈ ఆశ్రమం నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశ్రమ సందర్శనం అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు..
గాంధీజీ ఉన్న దేశంలోనే తాను పుట్టినందుకు గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. తాను ఢిల్లీ సీఎం(Arvind Kejriwal) అయ్యాక ఇది మొదటి పర్యటన అని తెలిపారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ తాను స్వాతంత్ర సమర యోధుల పంజాబ్ నుంచి వచ్చా. గాంధీజీ లేఖలు, ఆయన సారథ్యం వహించిన వివిధ ఉద్యమాలు తెలుసుకున్నా.
తమ రాష్ట్రంలో ప్రతి ఇంటిలో చరఖా భాగంగా ఉంది. మా అమ్మ, అమ్మమ్మ కూడా ఉపయోగిస్తారని అన్నారు.
Also Read : ఏకమైతేనే బీజేపీని ఎదుర్కోగలం