Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పిలుపునిచ్చారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ). గుజరాత్ రాష్ట్రంలో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే ఆప్ గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. ఈ తరుణంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్ అహ్మదాబాద్ లోని మహాత్మా గాంధీ నివసించిన సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అహ్మదాబాద్ నగరంలో ఆప్ సారథ్యంలో భారీ రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal )జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. బీజేపీయేతర పార్టీలను, వ్యక్తులను, సంస్థలను టార్గెట్ చేస్తోందంటూ మండి పడ్డారు.
అహంకారానికి ప్రజల్ని ప్రేమించే ఆప్ కి మధ్య రాబోయే ఎన్నికల్లో పోటీ జరగబోతోందంటూ ప్రకటించారు కేజ్రీవాల్. ఆయన ప్రధానంగా గుజరాత్ కు చెందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అడ్డాపై ఫోకస్ పెట్టారు.
వారినే టార్గెట్ చేశారు. ఇటీవల తన ఇంటి పై దాడికి పాల్పడిన ఘటన కూడా ప్రస్తావించారు కేజ్రీవాల్. గుజరాత్ లో గత 25 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ అవినీతిని అంతం చేయలేక పోయిందని ఆరోపించారు.
తాను ఏ పార్టీని విమర్శించేందుకు రాలేదు. బీజేపీని, కాంగ్రెస్ ను ఓడించేందుకు రాలేదన్నారు. కానీ గుజరాత్ ను గుజరాతీలను గెలిపించేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. ఆప్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నచ్చక పోతే దించండి అని కోరారు.
Also Read : ఓ మహాత్మా ఓ మహర్షీ – కేజ్రీవాల్..మాన్