BJP :శుభకృత్ నామ ఉగాది పర్వదినం సందర్భంగా అన్ని పార్టీలు తమ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణాలు ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కు ఈసారి తిరుగు లేదని వేద పండితుడు సెలవిచ్చారు.
ఇక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో ఈ కొత్త ఏడాదిలో రేవంత్ రెడ్డి హవా మరింత పెరుగుతుందని పండితుడు సెలవిచ్చారు. అయితే కేంద్రంలో ఓ ముఖ్య నేత మరణిస్తారంటూ కామెంట్ చేశారు.
ఇదిలా ఉండగా ఇక భారతీయ జనతా పార్టీ(BJP )తెలంగాణ ఆఫీసులో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ పంచాంగ శ్రవణం పఠించారు.
హైదరాబాద్ లోని నాంపల్లి పార్టీ ఆఫీసులో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ చీఫ్ బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ పాల్గొన్నారు.
2028 మే 5 వరకు ప్రధాన మంత్రి మోదీకి తిరుగు లేదని సెలవిచ్చారు. ఆయన మూడోసారి దేశానికి ప్రధానిగా ఎన్నికవుతారని చెప్పారు. ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయాలను దేశ ప్రజలు సమర్థిస్తారని, మద్దతు తెలియ చేస్తారని వెల్లడించారు.
అంతకు ముందు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో బీజేపీ చీఫ్ బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈనెల 14 నుంచి తాను చేపట్టబోయే పాదయాత్రకు రావాల్సిందిగా కోరారు.
Also Read : శుభప్రదం రాష్ట్రం అభివృద్ధి పథం