KCR : కేంద్రంపై యుద్దానికి సిద్దమవుతోంది టీఆర్ఎస్ సర్కార్. ఈ మేరకు ఈనెల 11న ఢిల్లీలో సీఎం కేసీఆర్ ( KCR )సారథ్యంలో దీక్షకు దిగనున్నారు. ఈ విషయాన్ని ప్రకటించారు మంత్రి కేటీఆర్.
పండించిన ధాన్యాన్ని కొనేంత దాకా వార్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మోదీని వదలబోమన్నారు. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్ మెంట్ ఎందుకు ఉండదని కేటీఆర్ ప్రశ్నించారు.
కావాలని తెలంగాణ పట్ల మోదీ సర్కార్ వివక్ష చూపుతోందంటూ ఆరోపించారు. పీయూష్ గోయల్ పై నిప్పులు చెరిగారు మంత్రి. పార్లమెంట్ ను, దేశ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ మేరకు ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు కేటీఆర్. గోయల్, కేంద్రం పూర్తిగా అబద్దాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
తమను తెలివి తక్కువ వాళ్లు అంటూ కామెంట్ చేయడాన్ని తప్పు పట్టారు. బండి సంజయ్ అనే దౌర్భాగ్యుడు, కిషన్ రెడ్డి అనే పనికి మాలిన మంత్రి అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకబోమని హెచ్చరించారు కేటీఆర్. తాము తల్చుకుంటే మెడలు వంచుతామన్నారు. 4న మండల కేంద్రాల్లో దీక్షలు చేపడతామని, జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు.
7న జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనలు చేపడతారని చెప్పారు కేటీఆర్. ఇక 8న ప్రతి గ్రామంలో కేంద్ర సర్కార్ దిష్టి బొమ్మ దహనం, ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండాలతో నిరసనతో పాటు 11న సీఎం దీక్షతో ముగుస్తుందన్నారు.
Also Read : తెలంగాణలో బీజేపీకి ఫ్యూచర్