Imran Khan : పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ బ‌చ్ గ‌యా 

అవిశ్వాస తీర్మానం కొట్టివేత 

Imran Khan : ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన పాకిస్తాన్ వ్య‌వ‌హారంలో గండం నుంచి గ‌ట్టెక్కారు ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. విప‌క్షాలు ఆయ‌న‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టారు.

ఇవాళ ఎదురు చూసిన వారికి కోలుకోలేని షాక్ ఇస్తూ తీర్పు చెప్పారు పాకిస్తాన్ స్పీక‌ర్. ప్ర‌ధాని ఖాన్ పై నో కాన్ఫిడెన్స్ మోష‌న్ వెనుక విదేశీ కుట్ర ఉంద‌ని ఆరోపించారు.

ఈ మేర‌కు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని ఈనెల 25వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదిలాఉండ‌గా అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టే సంద‌ర్భంగా అంతా పీటీఐ పార్టీ చీఫ్‌, ప్ర‌ధాన మంత్రి , మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)హాజ‌రు అవుతార‌ని అనుకున్నారు.

కానీ ఆయ‌న హాజ‌రు కాక పోవ‌డం విస్తు పోయేలా చేసింది. ఇదే స‌మ‌యంలో జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌ని ప్ర‌ధాని పీఎం సిఫార‌సు చేశారు. అవిశ్వాస తీర్మానం కాకుండా నేరుగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ ఆమోదించ‌క పోవ‌డంతో ఇమ్రాన్ ఖాన్ కు పెద్ద ఊర‌ట ల‌భించిన‌ట్ల‌యింది. దీంతో ప‌ద‌వీ గండం నుంచి త‌ప్పించుకున్నారు.

పీటీఐ నుంచి 22 మంది హాజ‌రు కాకా విప‌క్షాల నుంచి 176 మంది హాజ‌రు కావ‌డం విశేషం. ఒక వేళ అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ  పెట్టి ఉంటే క‌చ్చితంగా ఓడి పోయేవాడు. ర‌ద్దుకు వెళ్ల‌డంతో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ సంద‌ర్భంగా ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పాకిస్తాన్ ప్ర‌జ‌లు ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌ని పిలుపునిచ‌చ్చారు. త‌న‌పై కుట్ర జ‌రిగింద‌న్నారు..

Also Read : శ్రీ‌లంక‌లో అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూపై ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!