Drugs Case DCP : తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో(Drugs Case DCP) కీలక అంశాలను వెల్లడించారు పోలీసులు. ఇవాళ ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారచు డీసీపీ జోయల్ డేవిడ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఫుడింగ్ మింక్ పబ్ ను నిర్వహిస్తున్న నిర్వాహకులు అభిషేక్, అనిల్, డీజే వంశీ ధర్ రావు, కునాల్ ను అరెస్ట్ చేశామన్నారు.
మరో నిందితుడు అర్జున్ వీరమాచినేనని పరారీలో ఉన్నాడని వెల్లడించారు డీసీపీ. వెస్ట్ జోన్ డీసీపీగా పని చేస్తున్నారు జోయల్ డేవిడ్9Drugs Case DCP). అనిల్ వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఫుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ వినియోగించారని తెలిపారు. ఇది వాస్తవమన్నారు. టాస్క్ ఫోర్స్ దాడి చేసిన సమయంలో 148 మంది ఉన్నారని వెల్లడించారు.
రూల్స్ ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమేనని కానీ ఫుడింగ్ మింక్ పబ్ మాత్రం శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు నడిచిందన్నారు డీసీపీ జోయల్ డేవిడ్.
ఇదిలా ఉండగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. అంతే కాదు కొకైన్ ను డ్రింక్ లో వేసుకొని తాగినట్లు గుర్తించామని తెలిపారు.
బార్ కౌంటర్ లో కూడా డ్రగ్స్ సరఫరా చేశారని చెప్పారు డీసీపీ. పబ్ లోకి వెళ్లేందుకు కోడ్ భాష కూడా వాడారని వెల్లడించారు డీసీపీ. మేనేజర్ కునాల్ నుంచి పూర్తి వివరాలు ఇంకా రాలేదన్నారు. వచ్చాక వెల్లడిస్తానని చెప్పారు.
Also Read : హైదరాబాద్ లో పబ్ పై పోలీసుల దాడి