Mahinda Rajapaksa : శ్రీ‌లంక ప్ర‌ధాని మ‌హింద రాజ‌ప‌క్స రిజైన్

దేశ అధ్యక్షుడికి లేఖ స‌మ‌ర్ప‌ణ

Mahinda Rajapaksa : శ్రీ‌లంక దేశం ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతోంది. ఈ త‌రుణంలో ఆ దేశ అధ్య‌క్షుడు, ప్ర‌ధాన మంత్రిపై తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. ఇప్ప‌టికే జ‌నం రోడ్ల‌పైకి వ‌చ్చారు.

ఈ త‌రుణంలో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకోకుండా ఉండేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు ఆ దేశ అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్స‌. పోలీసు, ఆర్మీకి స‌ర్వాధికారాలు ప్ర‌క‌టించారు.

ఈ త‌రుణంలో శ్రీ‌లంక ప్ర‌ధాన మంత్రి మ‌హింద రాజ‌ప‌క్స(Mahinda Rajapaksa) త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రిజైన్ లెట‌ర్ ను దేశాధ్య‌క్షుడికి స‌మ‌ర్పించారు.

దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డేందుకు, రాజ‌కీయాల్లో సుస్థిర‌త కోసం తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాజ‌ప‌క్స‌. ఇదిలా ఉండ‌గా జ‌నంతో పాటు దేశ అధ్య‌క్షుడు , ప్ర‌ధాన మంత్రి వెంట‌నే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

దేశంలో హాహాకారాలు, ఆక‌లి కేక‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే భార‌త్ త‌న‌వంతు సాయం అంద‌జేసింది. మ‌రో వైపు ప్ర‌పంచం నుంచి కొంత సాయం కావాల‌ని కోరుతోంది శ్రీ‌లంక‌.

ఇదిలా ఉండగా ప్ర‌ధానంగా శ్రీ‌లంకను అప్పులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం ప‌త‌నం అంచున‌కు చేరింది. నిత్యావ‌స‌రాలు దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

రాజ‌ధాని కొలంబోలో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు కిలోకు రూ. 200 నుంచి రూ. 800 దాకా పెరిగాయి. దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ప్ర‌జ‌లు ప్రెసిడెంట్, ప్ర‌ధాన మంత్రిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే దిగి పోవాల‌ని కోరుతున్నారు.

Also Read : మ‌ళ్లీ నోరు జారిన బైడెన్

Leave A Reply

Your Email Id will not be published!