ICC Chairman : ఐసీసీ చైర్మ‌న్ నువ్వా నేనా 

గంగూలీ వ‌ర్సెస్ జే షా 

ICC Chairman  : ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తోంది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ. ప్ర‌పంచంలో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌గా దీనికి పేరుంది.

ఇక ఒక్క ఐపీఎల్ రిచ్ లీగ్ ద్వారానే ఈ సంస్థ‌కు దాదాపు కేవ‌లం ప్ర‌సార హ‌క్కుల ద్వారా రూ. 50 వేల కోట్ల‌కు పైగా రానుంది అంటే అర్థం చేసుకోవ‌చ్చు దాని స‌త్తా ఏమిటో.

ఇక ఇండియాలో బీసీసీఐకి ఉన్న స‌త్తా, ప‌వ‌ర్ ఏ సంస్థ‌కు లేదు. స‌ద‌రు సంస్థ ప్ర‌తినిధుల‌కు

భార‌త ధేశంలోని ప్ర‌ముఖుల‌కంటే ఎక్కువ ప్రాముఖ్య‌త ఉంటుంది. వారి హోదా, ఆదాయం గురించి ఎంత త‌క్కువ చెపితే అంత మంచిది.

బీసీసీఐ పూర్తిగా స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌. ఇక దాని ఆదాయం , కార్య‌క‌లాపాలు అంతా దానిష్టం. అందులో ఎవ‌రు వేలు పెట్ట‌డానికి వీలు లేదు.

కోట్లాది రూపాయ‌లు మూలుగుతూ, అక్ష‌య‌పాత్రను త‌ల‌పింప చేస్తున్న స‌ద‌రు సంస్థ‌పై క‌న్ను ప‌డింది ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షాకు. ఇంకేం కొడుకు జే షాను రంగంలోకి దించాడు.

ఏకంగా బీసీసీఐకి కార్య‌ద‌ర్శిని చేసేశాడు. ప్ర‌స్తుతం బీసీసీఐకి చీఫ్ గా సౌర‌వ్ గంగూలీ ఉన్నా మొత్తం న‌డిపించేది మాత్రం జే షానేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

జే షా ఎక్క‌డా క్రికెట్ ఆడిన దాఖ‌లాలు లేవు. కానీ తండ్రి అండ ఉంది. మొన్నే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు చైర్మ‌న్ గా ఎన్నిక‌య్యాడు. ప్ర‌స్తుతం ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్(ICC Chairman )పై క‌న్నేశాడు.

దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్న‌ప్ప‌టికీ దాదా వ‌ర్సెస్ జేషా మ‌ధ్యే పోటీ నెల‌కొన‌డం విశేషం. ఎలాగైనా ఈ ప‌ద‌విని ద‌క్కించు కోవాల‌ని వీరిద్ద‌రూ ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రు పావులు కదుపుతున్నారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ఐసీసీ చైర్మ‌న్ గా ఉన్న గ్రేగ్ బార్ క్లే ఉన్నారు. త‌న ప‌ద‌వీ కాలం పూర్త‌వుతోంది. ఆయ‌న ఆ పోస్టులో ఉండేందుకు ఇష్ట ప‌డ‌డం లేదు.

దీంతో బార్ క్లే వార‌సుడిగా గంగూలీ అవుతాడా జే షా చేజిక్కించు కుంటాడా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఏడాది ఇండియాలో వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగుతోంది.

అప్ప‌టి దాకా ఆ పోస్ట్ లో ఉండాల‌న్న‌ది దాదా క‌ల‌. కానీ జే షా నెగ్గుతాడా గంగూలీ పంతం నెగ్గించుకుంటాడా అన్న‌ది వేచి చూడాలి.

Leave A Reply

Your Email Id will not be published!