RBI Governor : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం వరుసగా 11వ సారి రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతం వద్ద ఉంచింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 సంవత్సరానికి ఇది మొదటి ద్వైమాసిక పాలసీ కావడం గమనార్హం. .
లిక్విడిటీ సర్దుబాటు సౌకర్యం 50 బేసిస్ పాయింట్లకు పునరుద్దరిస్తుందని ఆర్బీఐ(RBI Governor) ప్రకటించింది.
ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor)మాట్లాడారు మీడియాతో.
ఒమిక్రాన్ నుంచి ఆశించిన ప్రయోజనాలు , భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ కొత్త, భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఐరోపాలో ( రష్యన్ – ఉక్రెయిన్ ) నెలకొన్న వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టెలా చేస్తోందన్నారు ఆర్బీఐ గవర్నర్.
ఇక వాస్తవ జీడీపీ వృద్ధి 2022-23కి 7.2 శాతంగా అంచనా వేసినట్లు తెలిపారు.
ఇక ఆర్థిక సంవత్సరం 23కి గాను రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా అంచనా వేసినట్లు శక్తికాంత దాస్ చెప్పారు.
ఇక రెపో రేటు అనేది సెంట్రల్ బ్యాంకులకు డబ్బు ఇచ్చే రేటు. రివర్స్ రెపో రేటు అది వాణిజ్య రుణ దాల నుంచి రుణం తీసుకుంటుంది.
ఇక దిగుమతి చేసుకున్న ధరల ఒత్తిడి ఆధిపత్యం ఆర్బీఐ లక్ష్యాన్ని మించి పోవడం ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. ఇదిలా ఉండగా ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం పరిధిలో ఉంచాలని కేంద్ర సర్కార్ ఆర్బీఐని ఆదేశించింది.
మొత్తం మీద గవర్నర్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపనుంది.
Also Read : ఢిల్లీ మాస్కో ఎయిర్ ఇండియా ఫ్లైట్ రద్దు