Virender Sehwag : భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag)సంచలన కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు టైటిల్ ఫెవరేట్ గా ఉన్న ముంబై ఇండియన్స్ అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది.
మూడు మ్యాచ్ లు ఆడితే వాటన్నింటిని ఓడి పోయింది. ప్రస్తుతం ప్లే ఆఫ్ కు చేరుకుంటుందా లేదా అన్న అనుమానం నెలకొంది.
భారత క్రికెట్ జట్టుకు సంబంధించి మూడు ఫార్మాట్ లకు స్కిప్పర్ గా ఉన్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సైతం నిరాశజనక ప్రదర్శన ఇబ్బందికి గురి చేస్తోంది.
ఒకానొక దశలో పరాజయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు ఇటీవల ముంబైలో. కెప్టెన్ అన్నాక కాస్తంత ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్ పరంగా రాణిస్తున్నప్పటికీ బౌలింగ్ పరంగా బుమ్రా ఒక్కడే ఆదుకుంటున్నాడు.
ఇక ఆ జట్టులో మిగతా బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు ప్రత్యర్థి టీమ్ కు చెందిన బ్యాటర్లు. దీంతో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలు మూట గట్టుకోవడంపై సీరియస్ కామెంట్స్ చేశాడు ఆ జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్దనే.
తాజాగా భారత క్రికెట్ మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు మేనేజ్ మెంట్ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
జయదేవ్ ఉనద్కత్ ను ఎందుకు తుది జట్టుకు ఎంపిక చేయడం లేదని ప్రశ్నించాడు. అతడిని గనుక తీసుకుంటే ముంబైకి విజయం దక్కుతుందన్నాడు యువీ.
ఇదిలా ఉండగా సెహ్వాగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపాయి.
Also Read : పంజాబ్ నిలిచేనా గుజరాత్ గెలిచేనా