Virender Sehwag : భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag ). ఇలాగే ఆడుతూ పోతే ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం కష్టమని పేర్కొన్నాడు.
జట్టుకు బాధ్యత వహించే ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నాడు. ఎలా ఆడామన్నది కాదు ఎలా గెలిచామన్నదే జనం చూస్తారని ఆ మాత్రం తెలుసు కోకుండా రిషబ్ పంత్ ఆడడం దారుణమని పేర్కొన్నాడు.
గత కొంత కాలంగా పంత్ తన సహజ సిద్దమైన ఆట తీరును ఆడలేక పోతున్నాడని తెలిపాడు. తన వరకు బాగానే ఆడినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి నుంచి గట్టెక్కించ లేక పోయాడని తెలిపాడు.
కెప్టెన్ గా ఉన్నంత మాత్రాన కూల్ గా ఉండాలని సూచించాడు. తను ఆడితేనే మిగతా జట్టులోని ఆటగాళ్లు ఆడతారన్న ధ్యాస లేకుండా ఉంటే ఎలా అని మండిపడ్డాడు వీరేంద్ర సెహ్వాగ్.
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాణించినా జట్టును గెలిపించ లేక పోవడం బాధాకరమన్నాడు. ఒక రకంగా కెప్టెన్ గా పంత్ తీవ్ర వత్తిళ్లకు గురవుతున్నాడని అర్థమవుతోందని పేర్కొన్నాడు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag ).
ఇక పృథ్వీ షా అద్భుతంగా ఆడి జట్టులో కీలక పాత్ర పోషించినా పంత్ దానిని కంటిన్యూ చేయలేక పోయాడని పేర్కొన్నాడు. అత్యంత పేలవమైన ప్రదర్శనతో డీసీ ఆకట్టుకోలేక పోయిందన్నాడు.
పంత్ 32 రన్స్ చేసినా ఇంకా 20 రన్స్ చేసి ఉంటే డీసీ గెలిచి ఉండేదని పేర్కొన్నాడు వీరేంద్ర సెహ్వాగ్.
Also Read : ఆ క్రికెటర్ ఎవరో చెప్పు చహల్