KTR : దేశంలోని ప్రజలంతా ఇంగ్లీష్ కాకుండా హిందీ లోనే మాట్లాడాలని, ఉపయోగించాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా స్పష్టం చేశారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెల రేగింది. ఇప్పటికే తమిళనాడు అట్టుడుకుతోంది. ఆయనపై నిప్పులు చెరుగుతోంది. ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ సైతం తప్పు పట్టారు.
ప్రియం తమిళం మన ఉనికికి బలం అని ప్రముఖ తమిళ కవి భారతీదాసన్ రాసిన కవితా పంక్తులను ట్విట్టర్లో పోస్ట్ చేయడం కలకలం రేపింది. ఇక కర్ణాటక మాజీ సీఎంలు సిద్దరామయ్య, హెచ్ డి కుమార స్వామి మండిపడ్డారు.
కావాలని రాష్ట్రాలపై భాష పేరుతో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ తరుణంలో ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR )సీరియస్ అయ్యారు.
ఇంగ్లీష్ ను అమర్యాద పర్చడం మంచి పద్దతి కాదని సూచించారు. ఇంగ్లీష్ కాకుండా హిందీ లోనే మాట్లాడాలని చెప్పడం దారుణమన్నారు. ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించాడు. భారత దేశం ఒక వసుధైక కుటుంబమని స్పష్టం చేశారు కేటీఆర్. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని పేర్కొన్నారు.
ప్రజలు ఏం తినాలో ఏం ధరించాలో ఎవరిని ప్రార్థించాలో ఏ భాష మాట్లాడాలో ప్రజల నిర్ణయానికే వదిలే వేయాలని సూచించారు.
భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ అవుతాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Also Read : హోం గార్డు పనితీరుకు జడ్జి ఫిదా