Vaccine Price Slash : కరోనా పుణ్యమా అంటూ వ్యాక్సిన్ తయారీ కంపెనీల పంట పండుతోంది. ఇప్పటికే కోట్లాది రూపాయలు వారి చెంతకు చేరాయి. ఇది కాదనలేని సత్యం.
ఈ మహమ్మారి పుణ్యమా అంటూ కుబేరుల్లో స్థానం కూడా సంపాదించు కోవడం విశేషం. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. అయినా 60 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ మేరకు వైద్య నిపుణులు అందించిన సూచనల మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ 18 ఏళ్లు పైబడిన వారితో పాటు వయసు ముదిరిన వాళ్లకు సైతం వ్యాక్సిన్లు ఇవ్వాలని ఈ మేరకు ఈనెల 10 నుంచి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని నిన్నే ప్రకటించింది.
ఇదిలా ఉండగా సందిట్లో సడేమియా అన్న చందంగా కోవీషీల్డ్ తయారు చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, కోవీషీల్డ్ తయారు చేస్తున్న భారత్ బయో టెక్ కంపెనీలు బూస్టర్ డోస్ కు సంబంధించి వ్యాక్సిన్ల ధరలను (Vaccine Price Slash )అమాంతం పెంచాయి.
దీంతో ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రభుత్వ క్లినిక్ లలో కూడా టీకాలు అందుబాటులో ఉంటాయని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ల ధరలు అమాంతం పెంచడంపై సర్వత్రా ఆగ్రహం (Vaccine Price Slash )వ్యక్తమైంది.
కంపెనీలు దిగి వచ్చాయి. కోవీషీల్డ్ , కోవాక్సిన్ ధరలు ఒక్కో మోతాదుకు రూ. 225 చొప్పున తగ్గించాయి. ఈ విసయాన్ని సీరమ్ సీఇఓ ఆధార్ పూనా వాలా ఇవాళ తమ టీకా ధర ను రూ. 600 నుంచి రూ. 225కి తగ్గిస్తున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో భారత్ బయో టెక్ కో ఫౌండర్ సుచిత్రా ఎల్లా కూడా కోవాగ్జిన్ ధరను రూ. 1200 నుంచి రూ. 225కి తగ్గించినట్లు వెల్లడించారు.
Also Read : ‘షా’ కామెంట్స్ పై ‘కుమార’ కన్నెర్ర