KKR vs DC : ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఏకంగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది.
కోల్ కతా నైట్ రైడర్స్ (KKR vs DC)ముందు భారీ టార్గెట్ ముందుంచింది. దీంతో 216 పరుగులు చేయాల్సి ఉంది కేకేఆర్. ముందుగా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆసిస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ దుమ్ము రేపాడు.
ఏకంగా 61 పరుగులు చేశాడు. ఓపెనర్ పృథ్వీ షా మరోసారి రెచ్చి పోయాడు. 51 పరుగులు చేసి సత్తా చాటాడు. వీరిద్దరూ టాప్ స్కోరర్ గా నిలిచారు. ఆఖరులో వచ్చిన శార్దూల్ ఠాకూర్ , అక్షర్ పటేల్ లు సైతం సత్తా చాటారు.
ఇక కేకేఆర్ బౌలర్లలో సరైన్ రెండు వికెట్లు తీస్తే రస్సెల్ , వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీశారు. కెప్టెన్ రిషబ్ పంత్ 27 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
93 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇదిలా ఉండగా ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి రహానే, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ( కెప్టెన్ ) , సామ్ బిల్లింగ్స్ , నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ సరైన్ , పాట్ కమిన్స్ , ఉమేష్ యాదవ్ , సలామ్ , వరుణ్ చక్రవర్తి ని తీసుకున్నారు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ , పంత్ ( కెప్టెన ) పావెల్ , సర్ఫరాజ్ ఖాన్ , లలిత్ యాదవ్ , అక్షర్ పటేల్ , శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాదవ్ , రెహమాన్ , ఖలీల్ అహ్మద్ ఉన్నారు.
Also Read : కోల్ కతా వర్సెస్ ఢిల్లీ బిగ్ ఫైట్