KKR vs DC : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ఇవాళ ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇక బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్(KKR vs DC )దుమ్ము రేపింది. భారీ స్కోర్ సాధించంది. 6 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ఆసిస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ సత్తా చాటాడు.
61 పరుగులు చేస్తే ఓపెనర్ పృథ్వీ షా 51 రన్స్ తో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సరైన్ 2 వికెట్లు తీస్తే రస్సెస్ , వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీశారు.
ఇక 216 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ (KKR vs DC )లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 54 పరుగులు చేశాడు. నితీష్ రాణా 30 పరుగులతో రాణించాడు. లలిత్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.
ఇక కేకేఆర్ లో వరుసగా రెండు వికెట్లు వెంట వెంటనే కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో సామ్ బిల్లింగ్ ఔట్ కాగా తర్వాతి ఓవర్ లో పాట్ కమ్మిన్స్ వెనుదిరిగాడు. చివరగా 22 బంతుల్లో 77 రన్స్ కావాల్సి ఉండగా 33 పరుగులు మాత్రమే చేసి చాప చుట్టేసింది.
దీంతో నిన్నటి దాకా నిరాశతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు అద్భుత విజయం దక్కింది. ప్రస్తుతానికి ఐపీఎల్ 2022లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా బోణీ కొట్టలేదు చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్లు.
Also Read : వారెవ్వా వార్నర్ షాన్ దార్ షా