AP Cabinet Protest : కొత్త మంత్రివ‌ర్గం..అస‌మ్మ‌తి స్వ‌రం

ఏపీలో కొన‌సాగుతున్న అసంతృప్తులు

AP Cabinet Protest : నిన్న‌టి దాకా వైసీపీలో ఆ పార్టీ చీఫ్‌, ఏపీ సీఎం జ‌గ‌న్ ఏం చెబితే అదే చ‌ట్టం..శాస‌నం. తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు తీవ్ర అసంతృప్తుల‌కు కార‌ణమైంది. 25 మందితో కొత్త కేబినెట్(AP Cabinet Protest) రూపొందించారు.

ప్ర‌ధానంగా ఎన్న‌డూ లేని రీతిలో బీసీల‌కు ప్ర‌యారిటీ ఇచ్చారు. ఇప్ప‌టి దాకా జ‌గ‌న్ ఏం చెబితే తాము అదే చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

కానీ సీన్ మారింది. కొత్తగా మంత్రి వ‌ర్గం ప్ర‌క‌టించ‌డంతో ప‌ద‌వులు ఆశించిన వారంతా భ‌గ్గ‌మంటున్నారు.

త‌మ పేర్లు కొత్త‌గా ప్ర‌క‌టించిన జాబితాలో లేక పోవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌ధానంగా హోం శాఖ మంత్రిగా ఉన్న సుచ‌రిత ఉన్న‌ట్టుండి త‌న‌ను కొన‌సాగించ‌క పోవ‌డంపై ఫైర్ అయ్యారు.

ఈ మేర‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ లేఖ‌ను మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌కు ఇచ్చారు. మాచర్ల ఎమ్మెల్యే రామ‌కృష్ణా రెడ్డి , బాలినేని, త‌దిత‌రులు తీవ్ర అసంతృప్తితో ర‌గిలి పోతున్నారు.

ఇక సుచ‌రిత అనుచ‌రులు రోడ్డెక్కారు. నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా వైసీపీ పార్టీ ఏర్పాటు నుంచి

ఎన్న‌డూ లేని రీతిలో ఈసారి పెద్ద ఎత్తున ఆగ్ర‌హ జ్వాల‌లు రేగ‌డం విశేషం. కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఇప్పుడు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది ఆ పార్టీకి.

ఇక ఉద‌య భాను, పార్థ సార‌థి చివ‌రి దాకా ప‌ద‌వులు ఆశించి భంగ‌ప‌డ్డారు. వీరికి బ‌దులు జోగి ర‌మేశ్ ఒక్క‌రికే ఛాన్స్ ఇచ్చింది.

ఒక ద‌శ‌లో పార్థ‌సార‌థి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక జ‌గ్గయ్య‌పేట భ‌గ్గుమంటోంది.

కోటం రెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి చివ‌రి దాకా త‌న‌కు ఛాన్స్ ఉంటుంద‌నుకున్నారు. కానీ ఆయ‌న‌కు చోటు ద‌క్క‌లేదు.

ఇక క‌ర‌వు సీమ‌గా పేరొందిన అనంత‌పురం జిల్లాకు చెందిన ఏ ఒక్క‌రికీ ద‌క్క‌క పోవ‌డం అసంతృప్తికి దారి తీసింది.

తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి, అనంత వెంక‌ట్రామిరెడ్డి త‌మ‌కు కేబినెట్ లో చోటు ద‌క్కుతుంద‌ని అనుకున్నారు.

కానీ చివ‌రి లిస్టులో పేరు లేక పోవ‌డం ఒకింత నిరాశ‌కు గురి చేసింది. శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి కి (AP Cabinet Protest)చోటు ద‌క్క‌లేదు.

గ్రంధి శ్రీ‌నివాస్ కు కూడా నిరాశే మిగిలింది. పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు కూడా అసంతృప్తితో ఉన్నారు. స్పీక‌ర్ సీతారాంకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. శ్రీ‌కాకుళం నుంచి ధ‌ర్మాన‌కు ఛాన్స్ ఇచ్చారు జ‌గ‌న్ రెడ్డి.

Also Read : ప్రమాదంలో జ‌న ప్ర‌మోద‌ పత్రికలు

Leave A Reply

Your Email Id will not be published!