AP New Cabinet : ఏపీలో కొత్తగా కొలువు తీరిన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మంత్రులలో ఆనందం(AP New Cabinet )వ్యక్తం అవుతోంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కాకాణి గోవర్దన్ రెడ్డికి ప్రయారిటీ ఇచ్చారు జగన్ రెడ్డి.
ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఉన్నత విద్యావంతుడు. పీహెచ్డీ కూడా చేశారు. పలు పదవులు చేపట్టారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
ప్రస్తుతం మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ధర్మాన ప్రసాదరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.
మొదటిసారి కేబినెట్ లో చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ ప్రస్తుత కేబినెట్ (AP New Cabinet )లో స్థానం లభించింది.
ఎన్నో ఉన్నత పదవులు చేపట్టిన అనుభవం ధర్మానకు ఉంది.
తణుకు నుంచి తొలి సారి మంత్రిగా కొలువుతీరారు కారుమూరి నాగేశ్వర్ రావు.
ఆయనది వ్యవసాయ కుటుంబం. తాడేపల్లి గూడెంకు చెందన కొట్టు సత్యనారాయణ 1994 నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ గా ఉన్నారు.
దాడిశెట్టి రాజా బంగారం దుకాణం వ్యాపారం నుంచి వచ్చారు. ప్రజారాజ్యం నుంచి టికెట్ దక్కక పోవడంతో వైసీపీలో చేరారు.
ఇక ముత్యాల నాయుడు వార్డు స్థాయి నుంచి మంత్రిగా ఎదిగారు. జోగి రమేష్ కు అంతా అనుకున్నట్టే పదవి దక్కింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన వారు. పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మన్యం జిల్ఆ సాలూరు ఎస్టీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న దొర వైఎస్ కుటుంబానికి విధేయుడు. మేరుగ నాగార్జున ప్రొఫెసర్ నుంచి మంత్రిగా చోటు దక్కించుకున్నారు.
ఇక అంబటి రాంబాబు గురించి పరిచయం అక్కర్లేదు. వైసీపీ తరపున మొదటి నుంచి వాయిస్ వినిపిస్తున్నారు. న్యాయవాదిగా ఉన్నారు. 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1994, 2014లో ఓడి పోయారు. 2019లో సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నెడ్ క్యాప్ , ఏపీఐఐసీసీ చైర్మన్ గా పని చేశారు. ఉషశ్రీ చరణ్ సేవా కార్యక్రమాలతో పేరొందారు.
ఇక రోజా జనానికంతా తెలుసు. ఆమె నటిగా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత టీడీపీలో ఉన్నారు. అనంతరం వైసీపీలో చేరారు. నగరి ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు మంత్రి పదవి దక్కింది.
అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉనన అమర్ నాథ్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇక ప్రస్తుత కేబినెట్ లో అత్యంత తక్కువ వయసు కలిగిన మంత్రిగా రజని ఉన్నారు. ఆమె సాఫ్ట్ వేర్ గా పని చేశారు.
Also Read : కుల్దీప్ సేన్ కమాల్ కర్ దియా