Komatireddy Venkat Reddy : కోమ‌టిరెడ్డి స్టార్ క్యాంపెయిన‌ర్

ఇక నుంచి రాష్ట్ర వ్యాప్త టూర్

Komatireddy Venkat Reddy : ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి ఊహించ‌ని రీతిలో ఏఐసీసీ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఆయ‌న కూడా ఊహించ లేదు. ఇప్ప‌టికే రాష్ట్రంలో కేసీఆర్ స‌ర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు.

ఇంకో వైపు టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి రేసులో ఉన్నారు. అనుకోని రీతిలో ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా క‌ల్వ‌కుర్తికి చెందిన రేవంత్ రెడ్డికి ద‌క్కింది. దీంతో కొంత అసంతృప్తికి గుర‌య్యారు.

అనంత‌రం పార్టీ హైక‌మాండ్ తో మాట్లాడాక మెత్త ప‌డ్డారు. ప్ర‌స్తుతం పార్టీ కార్య‌క‌లాపాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించేందుకు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఈ మేర‌కు ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్ హోదా ఇచ్చింది. ఇక నుంచి ఆయ‌న రేవంత్ రెడ్డితో పాటు తిర‌గనున్నారు. రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌టి నుంచే కీల‌క ప‌ద‌వి అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం.

ఏది ఏమైనా కోమ‌టిరెడ్డి(Komatireddy Venkat Reddy) కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడ‌టంలో దిట్ట‌. అయితే ఏఐసీసీలో కీల‌క పోస్ట్ ఇస్తార‌ని అనుకున్నారు. కానీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో స్టార్ ప్ర‌చార క‌ర్త‌గా అప్ప‌గించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పార్టీలో ఒక్క‌రికే ప్ర‌యారిటీ ఇచ్చిన‌ట్లు కాకుండా కోమ‌టిరెడ్డికి కూడా ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి స‌ర్దుబాటు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది ఆ పార్టీ వ‌ర్గాల్లో.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ 40 మంది నాయ‌కుల‌ను పిలిచి మాట్లాడారు. స‌ర్దుకు పోవాల‌ని, స‌ర్కార్ పై పోరాటం చేయాల‌ని దిశా నిర్దేశం చేశారు.

Also Read : అమిత్ షా కామెంట్స్ కేటీఆర్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!