Elon Musk : ప్రపంచ సామాజిక మాధ్యమాలలో టాప్ లో కొనసాగుతోంది ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్. విద్యుత్ కార్ల సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్న ఎలోన్ మస్క్ 9.2 శాతం షేర్లను ట్విట్టర్ లో తీసుకున్నారు.
దీంతో ఆయన అనధికారికంగా ట్విట్టర్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతారని ఇటీవలే ప్రకటించారు సంస్థ సిఇఓ పరాగ్ అగర్వాల్. ఇదిలా ఉండగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎలోన్ మస్క్.
ఈ మేరకు ట్విట్టర్ బోర్డు సీటును తిరస్కరించారు సున్నితంగా ఎలోన్ మస్క్(Elon Musk ). అయితే అధికారికంగా తన పరపతిని కలిగి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
అత్యంత అనూహ్య పాత్రలలో ఒకటిగా తన ఖ్యాతి కలిగి ఉన్నారు ఎలోన్ మస్క్. ఇదిలా ఉండగా సంస్థలో ప్రధాన వాటాను కొనుగోలు చేశారు మస్క్. దాని అతి పెద్ద వాటాదారుగా మారిన తర్వాత మస్క్ ట్విట్టర్ బోర్డులో చేరుతారని అనుకున్నారు అంతా.
కానీ దానికి భిన్నంగా ఇవాళ మరో ప్రకటన వెలువడింది. కాగా ఎలోన్ మస్క్(Elon Musk )తమ సంస్థ బోర్డులో సభ్యుడిగా చేరడం లేదని స్పష్టం చేశారు ట్విట్టర్ సిఇఓ పరాగ్ అగర్వాల్.
ఇదే విషయాన్ని పరాగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. బోర్డులో ఎలోన్ మస్క్ సభ్యుడిగా ఉండేందుకు ఛాన్స్ వచ్చింది.
తాను 9.2 షేర్స్ కొనుగోలు చేయడం ద్వారా. కానీ తాను బోర్డులో చేర కూడదని ఎలోన్ మస్క్ నిర్ణయించుకున్నారు. 73.5 మిలియన్ షేర్లను కొనుగోలు చేశాడు మస్క్.
Also Read : మైక్రోసాఫ్ట్ సిఇఓ సంచలన కామెంట్స్