Uddhav Thackeray : రాముడి పేరుతో బీజేపీ రాజ‌కీయం

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే

Uddhav Thackeray : భార‌తీయ జ‌న‌తా పార్టీకి శివ‌సేన పార్టీల మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. మాట‌ల యుద్దం తారా స్థాయికి చేరింది. తాజాగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఉసిగొల్పుతోంది కేంద్ర స‌ర్కార్.

తాజాగా శివ‌సేన పార్టీ చీఫ్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే (Uddhav Thackeray) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఈ దేశంలో రాముడు అనే వాడు పుట్ట‌క పోయి ఉంటే బీజేపీ ఏం లేవ నెత్తేది అంటూ నిల‌దీశారు.

కాషాయం, హిందూత్వం క‌ల‌యిక కేంద్రంలో అధికారం సాధించ‌డంలో దోహ‌ద ప‌డుతుంద‌ని బాల్ థాక‌రే బీజేపీకి చూపించార‌ని ఉద్ధ‌వ్ ఠాక్రే స్ప‌ష్టం చేశారు. బీజేపీకి హిందూత్వంపై పేటెంట్ ఇవ్వ లేద‌న్నారు.

ప్ర‌తి దానిని రాజ‌కీయం చేసే బీజేపీకి ఈ దేశాన్ని పాలించే హ‌క్కు లేద‌న్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న్ సంఘ్ , జ‌న్ సంఘ్ వంటి విభిన్న పేర్ల‌ను క‌లిగి ఉన్న బీజేపీకి భిన్నంగా భ‌గ‌వా (కాసరి) ..హిందూత్వానికి సేన ఎల్ల‌ప్పుడూ క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు సీఎం.

కొల్హాపూర్ నార్త్ సీటు నుంచి ఏప్రిల్ 12న జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ కు చెందిన మ‌హా వికాస్ అఘాడీ ( ఎంవిఏ) అభ్య‌ర్థి జ‌య‌శ్రీ జాద‌వ్ త‌ర‌పున ప్ర‌చారం లో పాల్గొన్నారు ఉద్ద‌వ్ ఠాక్రే.

2019లో శివ‌సేన అభ్య‌ర్థి ఓడి పోయేందుకు బీజేపీ కార‌ణ‌మ‌ని ఆరోపించారు. రాముడు గ‌నుక పుట్ట‌క పోయి ఉంటే బీజేపీ రాజ‌కీయాల‌లో ఏ స‌మ‌స్య‌ను లేవ‌నెత్త లేద‌న్నారు.

బీజేపీ స‌మ‌స్య‌లను ప్ర‌స్తావించ‌డం లేదు. మ‌తం గురించి మాట్లాడుతోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : ఎఫ్‌బిఐ బృందం సంప్ర‌దించ లేదు

Leave A Reply

Your Email Id will not be published!