Imran Khan : విప‌క్ష నేత‌లు దొంగ‌లు – ఇమ్రాన్ ఖాన్

నిప్పులు చెరిగిన మాజీ ప్ర‌ధాన మంత్రి

Imran Khan : అవిశ్వాస తీర్మానం ద్వారా ఓట‌మి పాలై ప్ర‌ధాన మంత్రిగా త‌ప్పుకున్న మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నియాజీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు ఇవాళ‌. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో కేవ‌లం 2 ఓట్ల తేడాతో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. అనంత‌రం ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన సంకీర్ణ ప్ర‌భుత్వం పాకిస్తాన్ లో కొలువు తీర‌నుంది.

ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్ష పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌ను దొంగ‌లు అంటూ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్. అలాంటి దొంగ‌ల స‌ర‌స‌న తాను కూర్చోబోనంటూ స్ప‌ష్టం చేశారు.

8 వేల కోట్ల అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వ్య‌క్తి ప్ర‌ధానిగా ఎవ‌రిని ఎంపిక చేసినా, లేదా ఎన్నుకున్నా దేశానికి తీర‌ని అవ‌మాన‌మ‌ని పేర్కొన్నారు. జాతీయ అసెంబ్లీకి తాము రాజీనామా చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).

త‌న‌ను దించ‌డం వెనుక విదేశీ హ‌స్తం ఉంద‌ని ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా మాజీ ప్ర‌ధాన మంత్రి తీసుకున్న నిర్ణ‌యాన్ని ధ్రువీక‌రించారు పాకిస్తాన్ మాజీ అంత‌ర్గ‌త మంత్రి షేక్ ర‌షీద్.

అసెంబ్లీలో కూర్చోవ‌డం వ‌ల్ల ఒరిగేదీ ఏమీ ఉండ‌ద‌న్నారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు షెహ‌బాజ్ ష‌రీఫ్ ను బ‌ల ప‌రుస్తుంద‌ని , అందుకే జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పారు.

పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో ఇమ్రాన్ ఖాన్(Imran Khan) త‌న సూచ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చాడ‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో మాజీ ప్ర‌ధాని పెషావ‌ర్ ను సంద‌ర్శిస్తాడ‌ని వెల్ల‌డించారు ర‌షీద్.

విదేశీ కుట్ర‌కు వ్య‌తిరేకంగా బ‌య‌ట‌కు రావాల‌ని ప్ర‌తి ఆదివారం దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపు ఇస్తార‌ని చెప్పారు.

Also Read : ఆర్థిక సంక్షోభం పాల‌కుల వైఫ‌ల్యం

Leave A Reply

Your Email Id will not be published!