TCS : రతన్ టాటా సారథ్యంలోని టాటా గ్రూప్ ఏది చేపట్టినా బంగారమే అవుతోంది. భారతీయ దిగ్గజ వ్యాపారవేత్తలలో ఆయన కూడా ఒకరు. ఇక ఆయన ఏర్పాటు చేసిన టాటా కన్సట్టెన్సీ సర్వీస్ (టీసీఎస్ ) దుమ్ము రేపుతోంది.
ఐటీ సెక్టార్ లో టాప్ లో నిలుస్తోంది. మిగతా ఐటీ కంపెనీలకు ధీటుగా పరుగులు తీస్తోంది. ఈ తరుణంలో తాజాగా టీసీఎస్ (TCS)రికార్డుల మోత మోగిస్తోంది.
అటు ఆదాయంలోనూ ఇటు నియామకాల్లోనూ, ఆర్డర్లు చేజిక్కించు కోవడంలో టీసీఎస్ (TCS) దుమ్ము రేపుతోంది. ఇక ఈ ఏడాది 2022 మార్చి నెలతో ముగిసిన నాల్గో క్వార్టర్ లో టీసీఎస్ ఆదాయం గత ఏడాది కంటే ఈసారి గణనీయంగా పెరిగింది.
ఏకంగా 16 శాతం వృద్ధిని సాధించింది. దీంతో టీసీఎస్ ఆదాయం రూ. 50, 000 కోట్లకు పైగా సాధించింది. ఇది ఐటీ సెక్టార్ ను విస్తు పోయేలా చేసింది. గత ఏడాదిలో అయితే రూ. 43 వేల 705 కోట్లుగా ఉంది.
ఇక నికర లాభం పరంగా చూస్తే 7 శాతం వృద్ధి చెందడం విశేషం. రూ. 9 వేల 246 కోట్ల నుంచి రూ. 9, 926 కోట్లకు పెరిగింది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ ఆదాయం 17 శాతం వృద్దిని సాధించింది.
దీంతో 1, 64, 177 కోట్ల నుంచి 1, 91, 754 కోట్లకు పెరిగింది. ఇక ఈ ఆర్థిక ఏడాదిలో నికర లాభం 18 శాతం వృద్ధి సాధించంది. రూ .32 , 430 కోట్ల నుంచి రూ. 38, 327 కోట్లకు చేరింది.
ఇక టీసీఎస్ గణనీయంగా ఆర్డర్లను పొందింది. క్లౌడ్ , డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ , 5జీ , సైబర్ సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్ రంగాలలో పనులు దక్కించుకుంది.
Also Read : ట్విట్టర్ పై ఎలోన్ మస్క్ సెటైర్