TSPSC : ఇంట‌ర్వ్యూల ర‌ద్దుకు ప‌చ్చ జెండా

గ్ర‌న్ సిగ్న‌ల్ ఇవ్వ‌నున్న‌ టీఎస్పీఎస్సీ

TSPSC : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే ప్ర‌తి ప‌రీక్ష‌కు ఇంట‌ర్వ్యూలు గ‌తంలో ఉండేవి. కానీ నేరుగా ప‌రీక్ష నిర్వ‌హించి ప్ర‌తిభ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసేందుకు క‌స‌ర‌త్తు స్టార్ట్ చేసింది.

ఈ మేర‌కు త్వ‌ర‌లోనే కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఇందులో భ‌గంగా టీఎస్పీఎస్సీ (TSPSC) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే గ్రూప్ -1, 2 పోస్టుల‌కు ఇక నుంచి ఇంట‌ర్వ్యూలు తీసి వేసే పనిలో ప‌డింది.

దీంతో త్వ‌ర‌లో ఉత్త‌ర్వులు వెలువ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. న్యాయ ప‌రిధిలో చ‌ర్చించాక ఈ నిర్ణ‌యం తీసుకోనుంది. ఇదిలా ఉండ‌గా సంస్థ గ‌వ‌ర్న‌ర్ ప‌రిధిలో ఉంటుంది.

కేబినెట్ ప‌ర్మిష‌న్ అవ‌స‌రం లేద‌ని నిర్దార‌ణ‌కు వ‌చ్చింది క‌మిష‌న్. దీంతో రెండు రోజుల్లోనే అభ్య‌ర్థుల‌కు తీపి క‌బురు చెప్ప‌నుంది. టెట్ ప‌రీక్ష అయి పోయాక 20 వేల టీచ‌ర్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది క‌మిష‌న్.

ఇదిలా ఉండ‌గా పోటీ ప‌రీక్ష‌ల కోసం మార్పు చేర్పులు చేసేందుకు మంత్రివ‌ర్గం ఆమోదం అవ‌స‌రం లేద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఇక త్వ‌ర‌లోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌నుంద‌న్న‌మాట‌.

అయితే అసెంబ్లీ సాక్షిగా సీఎం 90 వేల పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ ఈరోజు వ‌ర‌కు ఒక్క నోటిఫికేష‌న్ రాలేదు.

తాజాగా 30 వేల 453 పోస్టుల‌కు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వీట‌న్నంటికీ నోటిఫికేష‌న్లు ఇచ్చే ప‌నిలో ప‌డింది తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ .

ఇదిలా ఉండ‌గా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వ‌స్తున్న ప్ర‌భుత్వం ఈరోజు వ‌ర‌కు నోటిఫికేష‌న్లు ప్ర‌క‌టించ‌క పోవ‌డాన్ని నిరుద్యోగులు మండి ప‌డుతున్నారు.

Also Read : కాంట్రాక్టు ఉద్యోగుల‌కు లైన్ క్లియ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!