Antony Blinken : అమెరికా మరోసారి భారత్ పై నోరు పారేసుకుంది. తన తీరు మారడం లేదు. క్లింటన్ మారి బైడెన్ వచ్చినా ఆ దేశం తన విదేశాంగ విధానాన్ని మార్చు కోవడం లేదు.
ప్రపంచంలోని ప్రతి దేశంలో వేలు పెట్టడం లేదా జోక్యం చేసుకోవడం పనిగా పెట్టుకుంది. ఉక్రెయిన్, రష్యా యుద్దం జరుగుతున్న సమయంలో రష్యా సపోర్ట్ తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది అమెరికా.
ఈ తరుణంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్ రోవ్ ఇండియాలో పర్యటించారు. ఈ మేరకు తాము ఎంతైనా ఆయిల్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో మానవ హక్కుల దుర్వినియోగం జరుగుతోందంటూ ఆరోపించారు.
ఒక రకంగా మోదీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. భారత్ లో కొందరు అధికారులతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ మండిపడ్డారు.
ఇండియాలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తూ వస్తున్నామని చెప్పారు మిస్టర్ బ్లింకెన్(Antony Blinken). అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ , విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర , రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి మాట్లాడారు.
హక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావించే తప్పా నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించేందుకు సాహసించ లేదు.
ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకులలో మోదీ ఒకరుగా ఉన్నారు. భారత విదేశాంగ విధానం ఎవరికీ అంతు చిక్కడం లేదు.
Also Read : స్వాతంత్ర పోరాటం మళ్లీ ప్రారంభం