INDIA US : ఉగ్ర‌వాదంపై ఉక్కు పాదం మోపాలి

పాకిస్తాన్ కు అమెరికా, ఇండియా హెచ్చ‌రిక

INDIA US : ఉగ్ర‌వాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఈ మేర‌కు భార‌త్, అమెరికా సంయుక్తంగా ప్ర‌క‌ట‌న చేశాయి. టెర్ర‌రిజంపై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశాయి.

ఇందులో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ , డిఫెన్స్ సెక్ర‌ట‌రీ లాయిడ్ ఆస్టిన్ , ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సిం్ , విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(INDIA US) పాల్గొన్నారు.

మినిస్టీరియ‌ల్ మీట్ త‌ర్వాత ఇరు దేశాలు కీల‌క వ్యాఖ్య‌లు చేశాయి. ఉగ్ర‌వాదంపై త‌క్ష‌ణ‌, స్థిర‌మైన , తిరుగులేని చ‌ర్య తీసుకోవాల‌ని సూచించాయి.

త‌మ ఆధీనంలో ఉన్న ఏ భూభాగాన్ని కూడా ఉగ్ర‌వాద దాడులుకు ఉపయోగించ‌కుండా చూడాల‌న్నారు. ముంబై దాడి, ప‌ఠాన్ కోట్ దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ స్ప‌ష్టం చేశాయి.

ఇప్ప‌టికే ప్ర‌ధాని గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో 2 ఓట్ల‌తో ఓట‌మి పాలై రాజీనామా చేశారు. కొత్త‌గా షెహ‌బాజ్ ష‌రీఫ్ కొలువు తీర‌నున్నారు.

ఈ స‌మ‌యంలో అమెరికా, ఇండియా చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఎవ‌రు పాల్గొన్నారో వారిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశాయి.

ఒక ర‌కంగా అమెరికా క‌న్నెర్ర చేసిందని చెప్ప‌క త‌ప్ప‌దు. పాకిస్తాన్ త‌న కార్య‌క‌లాపాల‌ను బంద్ చేసుకోవాలి. టెర్ర‌రిస్టుల‌కు అడ్డాగా మార కూడ‌ద‌నేది త‌మ అభిమ‌త‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశాయి.

టెర్ర‌ర్ గ్రూప్ లు, వ్య‌క్తుల‌పై ఆంక్ష‌లు విధించాయి. మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌కంపై ఫోక‌స్ పెట్టాల‌న్నాయి. ఆల్ ఖైదా, ఐసిస్ , ల‌ష్క‌రే తోయిబా త‌దిత‌ర సంస్థ‌ల‌పై స‌మిష్టి(INDIA US) చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరాయి.

Also Read : భార‌త్ లో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న

Leave A Reply

Your Email Id will not be published!