Shahabaz Sharif : షెహబాజ్ ప్రమాణం మిన్నంటిన సంబురం
కాశ్మీర్ పై నోరు పారేసుకున్న పాకిస్తాన్ ప్రధాని
Shahabaz Sharif : పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆ దేశానికి మూడుసార్లు ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్ కు స్వయాన సోదరుడు.
పదవీచ్యుతుడైన ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయడంతో ఆయన విజయం ఖాయమైంది. దేశంలో వారం రోజుల పాటు రాజకీయ గందరగోళానికి తెర పడింది.
ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కొత్త ప్రధానిగా షెహబాజ్ ప్రమాణం చేశారు. షరీఫ్ (Shahabaz Sharif)ను ఆ దేశ పార్లమెంట్ అంతకు ముందు రోజు ఎన్నుకుంది.
ఇక ప్రత్యర్థిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ విధేయుడిగా పేరున్న షా మహమూద్ ఖురేషీ ఉప సంహరించుకున్న అనంతరం షెహబాజ్ కు లైన్ క్లియర్ అయ్యింది.
అయితే వచ్చీ రావడంతోనే రెండు అణు శక్తుల మధ్య దశాబ్దాల వివాదానికి కేంద్రంగా ఉన్న కాశ్మీర్ కు ఇంకా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని నోరు పారేసుకున్నారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి కనిష్ట స్థాయికి చేరిందని, ఆర్థిక మాంద్యం నెలకొందని, వడ్డీ రేట్ల పెంపుదల వంటి వాటిని పరిష్కరిస్తానని చెప్పారు.
ఇది ధర్మం సాధించిన విజయమని, చెడు ఓడి పోయిందన్నారు. అమెరికాతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని పిలుపునిచ్చాడు. ఇదిలా ఉండగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యుఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు.
తమ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటోందంటూ మండిపడ్డారు. అంతే కాదు తనను దించేందుకు ఆ దేశం కుట్ర పన్నిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపాలి