UP MLC Polls : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ శాసన మండలి ఎన్నికల్లో సైతం సత్తా చాటింది. తనకు ఎదురే లేదని స్పష్టం చేసింది. ఇక ఈ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది.
కానీ విచిత్రం ఏమిటంటే బీజేపీ జెండా ఎగుర వేసినా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో మాత్రం స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
బీజేపీ అభ్యర్థి ఓడి పోవడం విశేషం. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నపూర్ణ సింగ్ ..సమీప బీజేపీ క్యాండిడేట్ పై గెలుపొందారు. మొత్తం రాష్ట్రంలో 36 స్థానాలకు ఎన్నికలు జరిగితే 33 స్థానాలను కాషాయం కైవసం చేసుకుంది.
దీంతో శాసన మండలిలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ లభించింది. స్పష్టమైన ఆధిక్యం లభించింది. దీంతో అసెంబ్లీలో ఇటు మండలిలో ఇక సీఎం యోగికి తిరుగు లేకుండా పోయింది.
ఇదిలా ఉండగా సమాజ్ వాది పార్టీపై పట్టు సాధించింది. 36 సీట్లకు ఎన్నికలు జరిగితే ఇందులో 9 మంది ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా(UP MLC Polls) ఎన్నికయ్యారు.
ఇక మిగిలిన 27 శాసనమండలి స్థానాల్లో 95 మంది పోటీ పడ్డారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. భారీ విజయాన్ని కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ విజయం జాతీయ వాదానికి, అభివృద్దికి, సుపరిపాలనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు యోగి . విచిత్రం ఏమిటంటే యోగి హవా కొనసాగినా ప్రధాని ప్రాతినిధ్యం వహించిన వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ పదవి కోల్పోవడం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
Also Read : రాజీనామా చేసే ప్రసక్తి లేదు – ఈశ్వరప్ప