KCR : రైతులకు పూర్తి భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. ఏ ఒక్క గింజను వృధాగా పోనివ్వమంటూ చెప్పారు. సీఎం మీడియాతో మాట్లాడారు. యాసంగి సీజన్ లో పండిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని రైతాంగానికి పూర్తిగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
కేంద్రం చేతులెత్తేసింది. అయినా మాది రైతు ప్రభుత్వం. వారికి అండగా ఉండాలని నిర్ణయించామన్నారు కేసీఆర్. ఉచిత విద్యుత్ కోసం రూ. 12 వేల కోట్లు , రైతు బంధుకు రూ. 15 వేల కోట్లు, రైతు బీమాకు రూ. 1,600 కోట్లు భరిస్తున్నామని స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని చూస్తోందంటూ మండిపడ్డారు కేసీఆర్9KCR). గతంలో ఎన్నడూ లేని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా సాగు జరిగిందన్నారు.
దేశంలో ఎక్కడా జరగలేదన్నారు సీఎం. కేంద్రంలో పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని ఆరోపించారు. మోదీకి మతి తప్పిందని, గోయల్ కు బుద్ది లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
మతం పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఇక నుంచి విద్యా శాఖ ద్వారా యూనివర్శిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు కేసీఆర్(KCR).
పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి 3 ఏళ్ల వయో పరిమితిని పెంచినట్లు తెలిపారు సీఎం. గ్రూప్ 1, 2 పోస్టుల్లో ఇంటర్వ్యూలు ఉండవని స్పష్టం చేశారు.
ఇక నుంచి ఐటీ పరిశ్రమలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read : రూ. 200 కోట్లతో బీవీఎస్ పెట్టుబడి