Joe Biden : అమెరికా దేశాధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ మరోసారి నిప్పులు చెరిగారు రష్యా చీఫ్ పుతిన్ పై. ముమ్మాటికీ యుద్ధ నేరస్థుడేనంటూ ఆరోపించారు. మారణ హోమానికి పాల్పడుతున్న పుతిన్ ను ఈ ప్రప్రంచం క్షమించదన్నాడు.
ఉక్రెయిన్ పై జరుగుతున్న యుద్ధ కాండకు బాధ్యత వహించాలన్నాడు. ఇంకెంత కాలం ఈ మనుషుల్ని చంపుకుంటూ వెళతారంటూ ప్రశ్నించాడు బైడెన్. బుచాలో ఏం జరిగిందో రష్యా ఎంతటి విధ్వంసానికి పాల్పడిందో యావత్ ప్రపంచం చూసిందన్నారు.
అంతే కాకుండా ఓడ రేవు నగరమైన మారియుపోల్ ను లొంగ దీసుకునేందుకు రష్యా పన్నాగం పన్నుతోందంటూ మండిపడ్డారు బైడెన్(Joe Biden ). ఇప్పటికీ తన రక్త దాహాన్ని తీర్చుకుంటూనే ఉన్నాడంటూ పుతిన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుతిన్ దిగి వచ్చేంత దాకా తమ పోరాటం ఆగదన్నారు. యావత్ లోకమంతా పుతిన్ ను బహిష్కరించే స్థాయికి తెచ్చుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులపై, అమాయక మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడడం దారుణమన్నారు.
ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు బైడెన్. ఇదే సమయంలో రష్యా జీవాయుధాలు ప్రయోగించే ప్రమాదం ఉందని , జాగ్రత్తగా ఉండాలని ఉక్రెయిన్ ను హెచ్చరించింది.
ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని భద్రంగా ఉండాలని కోరారు జోసెఫ్ బైడెన్(Joe Biden ). పుతిన్ దృష్టిలో ఉక్రెయిన్ అనే దేశం ఉండ కూడదని కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు.
మాస్కో జాతి హత్యకు ప్రయత్నించిందంటూ ఆరోపించారు అమెరికా చీఫ్ బైడెన్. రోజు రోజుకు రష్యా దురాగతాలు పెరిగి పోతున్నాయని , వాటిని తాము అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.
Also Read : షెహబాజ్ ప్రమాణం మిన్నంటిన సంబురం