Modi G7 Summit : జర్మనీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా మారింది. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం జరుగుతోంది. సైనిక చర్య పేరుతో మూకుమ్మడి దాడికి పాల్పడుతోంది రష్యా.
అమెరికాతో పాటు యురోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్ , జర్మనీ రష్యాపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆర్థిక ఆంక్షలు కూడా విధించింది. ఇదిలా ఉండగా భారత దేశం మాత్రం తటస్థ, మధ్యేవాద వైఖరిని(Modi G7 Summit) అవలంభిస్తోంది. రష్యాతో సత్ సంబంధాలు కలిగి ఉంది.
ఇదే విషయంపై అమెరికా కన్నెర్ర చేసినా డోంట్ కేర్ అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో అమెరికా చిలుక పలుకులు పలుకుతోంది. ప్రస్తుతం జీ-7 దేశాలలో భారత దేశం కూడా ఒకటి. ఈ సమావేశానికి జర్మనీ ఆతిథ్యం ఇస్తోంది.
ఈ సమయంలో అమెరికాకు వత్తాసు పలుకుతున్న జర్మనీ ,రష్యాను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ఇండియాకు ఆహ్వానం పంపాలా లేదా అన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది.
ఇదే సమయంలో రష్యా ఇంధన దిగుమతులపై నిరంతరం ఆధార పడుతోంది జర్మనీ. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది.
ఉక్రెయిన్ పై ఎడతెరిపి లేకుండా యుద్దానికి పాల్పడుతున్న రష్యాను ఖండించడం లేదు ఇండియా. దీంతో వచ్చే జూన్ నెలలో తాను నిర్వహించే గ్రూప్ ఆఫ్ సెవెన్ సమ్మిట్ కు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని (Modi G7 Summit)ఆహ్వానించాలా వద్దా అని పునరాలోచనలో పడింది జర్మనీ.
బవేరియాలో జరిగే సమావేశంలో జర్మనీ సెనెగల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియాలను అతిథులుగా చేర్చేందుకు కూడా సిద్దమైంది. అయితే ఇండియా విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Also Read : ఉత్తర ప్రదేశ్ లో గూండాగిరి చెల్లదు