Beijing Embassy : కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్థిక నగరంగా పేరొందిన షాంఘై పూర్తిగా ఇబ్బందుల్లో ఇరుక్కుంది. ఎక్కడ చూసినా నిర్మానుశ్య వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కేసుల సంఖ్య పెరుగుతోంది.
దీంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ అంశంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అక్కడున్న భారతీయులు బీజింగ్ లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని (Beijing Embassy)సంప్రదించాలని కోరారు.
ఇక చైనాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1,500 కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలోని షాంఘై లో కోవిడ్ -19 రోగుల కోసం తాత్కాలికంగా న్యూ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ హాలులో చికిత్సలు ఏర్పాటు చేశారు.
కోవిడ్ కేసుల పెరుగుదలతో అన్ని దారులు మూసుకు పోయాయి. ఈ తరుణంలో భారత ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపట్టింది. ఇండియన్స్ ప్రస్తుతానికి బీజీంగ్ లోని రాయబార ఆఫీసును (Beijing Embassy)సంప్రదించాలని సూచించింది.
ఈ మేరకు కాన్సులేట్ జరల్ ఆఫ్ ఇండియా ఓ నోటీసులో తెలిపింది. షాంఘై మున్సిపల్ పీపుల్స్ గవర్నమెంట్ ద్వారా షాంఘై నగరంలో సేవలు ఉండవని తెలిపింది. దీంతో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది.
అందుకే బీజింగ్ లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. భారతీయ పౌరులు కాన్సులేట్ సేవల కోసం 8618930314575/ 18317160736. ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరింది.