Revanth Reddy : ఓ వైపు రైతుల ప్రాణాలు గాల్లో కలిసి పోతుంటే ఇంకో వైపు ధర్నా పేరుతో సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
తెలంగాణలో నెలకొన్న రైతుల పరిస్థితి గురించి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సారథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కలిశారు. ఈ సందర్బంగా తాము రూపొందించిన నివదేకను ఆమెకు అందజేశారు.
అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడారు. రైతులు దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారని, మరికొందరు బలవంతపు మరణాలకు పాల్పడుతునన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కార్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో కేసీఆర్ వరి ధాన్యం పేరుతో ధర్నాకు దిగితే ఇక్కడ బీజేపీ ఆందోళన బాట పట్టిందన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరవడం వల్ల దాదాపు 30 శాతానికి పైగా పంట దళారుల చేతుల్లోకి వెళ్లి పోయిందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో 8 లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందని , దీని విలువ దాదాపు రూ. 2 వేల 600 కోట్లు అని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
బాజాప్తాగా వడ్లు కొనుగోలు చేయాల్సింది కేంద్రం కాదని రాష్టమేనని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్. రైతుల చావులకు కారణమైన టీఆర్ఎస్, బీజేపీలకు పోయే కాలం దాపురించిందన్నారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు.
Also Read : ప్రాణహితకు పుష్కరశోభ