Bhavish Agarwal : తాను ఓలా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తోసి పుచ్చారు ఓలా సంస్థ సిఇఓ భవిష్ అగర్వాల్(Bhavish Agarwal ). ఈ సందర్భంగా కొత్త ప్రాజెక్టుల గురించి అప్ డేట్ ఇచ్చారు.
తాను ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. తనకు సహాయంగా ఇంకొకరు నియమించుకుంటే తప్పేమీ కాదన్నారు. ఇక ఓలా ఎలక్ట్రిక్ కారుతో సహా కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇందు కోసం కొత్త టెక్నాలజీపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఇదే సమయంలో ఓలా గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) జిఆర్ , అరుణ్ కు కీలక బాధ్యతలు అప్పగించిన మాట వాస్తవమేనని పేర్కొన్నాయి.
అయితే అరుణ్ కే ఓలా పగ్గాలు పూర్తిగా అప్పగిస్తారన్న ప్రచారాన్ని తప్పు పట్టారు. ఇక నుంచి ఓలా కంపెనీకి సంబంధించి టెక్నాలజీ, ఇంజనీరింగ్ లో పని చేయనున్నారు.
ఓలా ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్ పై తగినంత దృష్టి పెట్టనున్నట్లు ఈ సందర్భంగా భవిష్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ కారు, సెల్ తయారీ, గిగా ఫ్యాక్చరీ వంటి కొత్త ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వేగవంతం చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.
దేశంలో భవిష్యత్తును నిర్మించడంలో కంపెనీ ముందుకు సాగుతోందన్నారు. సీఎఫ్ఓ అరుణ్, జీఆర్ విస్తరించిన పాత్రతో కంపెనీ రోజూ వారి నిర్వహణ నుంచి తాను తప్పు కోవడం లేదన్నారు మరోసారి భవిష్ అగర్వాల్.
అరుణ్ గొప్ప నాయకత్వ ప్రతిభ కలిగిన వ్యక్తి. ఓలా ఆపరేటింగ్ ను నిర్వహించేందుకు తను సహాయం చేస్తాడని తెలిపాడు.
Also Read : ట్విట్టర్ బోర్డులో చేరని ఎలోన్ మస్క్