Imran Khan : అవిశ్వాస తీర్మానం వీగి పోయిన అనంతరం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పాకిస్తాన్ లో. ప్రధాని పదవికి రాజీనామా చేసి, అధికార నివాసం నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తనకు గిఫ్ట్ గా ఇచ్చిన నెక్లెస్ ను లోపాయికారిగా వ్యాపారికి రూ. 18 కోట్లకు విక్రయించారన్న ఆరోపణలపై ఇమ్రాన్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా ప్రధానమంత్రిగా కొలువు తీరిన షెహబాజ్ షరీఫ్ ఇప్పుడు మాజీ ప్రధానిని టార్గెట్ గా చేసుకున్నారు.
కేసుల మోత మోగించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. తాజాగా ఇమ్రాన్ కాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్రమాదం తక్కువగా ఉండింది కానీ ఇప్పుడు ప్రతిపక్షాల కూటమి ఎప్పుడైతే కొలువు తీరిందో తన ప్రాణానికి ముప్పు ఎక్కువగా ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇప్పటికే ఈ మాజీ ప్రధాన మంత్రి తను దిగి పోవడం వెనుక అమెరికా కుట్ర ఉందని ఆరోపించారు.
ఇక పాకిస్తాన్ కు మూడుసార్లు ప్రధానిగా పని చేసి కోట్లాది రూపాయల కుంభకోణంకు పాల్పడి, శిక్షను అనుభవిస్తున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తిరిగి లండన్ నుంచి పాకిస్తాన్ కు రానున్నారు.
ఆయన తమ్ముడే ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి కావడం గమనార్హం. ఇక అవిశ్వాస తీర్మానం ద్వారా ఓటమి పాలైన మొట్టమొదటి పీఎంగా ఇమ్రాన్ ఖాన్(Imran Khan) చరిత్ర సృష్టించారు.
అధికారం కోల్పోయాక పెషావర్ లో మొట్టమొదటి సారిగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఖాన్ ఈ కామెంట్స్ చేశారు. 45 ఏళ్లుగా నేను ఏనాడైనా చట్టాన్ని ఉల్లంఘించానా అని ప్రశ్నించారు న్యాయ వ్యవస్థను.
తాను దేనినీ లెక్క చేయనని ప్రజల అండ తనకు ఉందన్నారు. ఇక యుద్దమే మిగిలిందన్నారు.
Also Read : సంగీతం వల్లే ఈ స్థాయిలో ఉన్నా