RR vs GT : ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో భాగంగా సమ ఉజ్జీల మధ్య సమరం కొనసాగుతోంది. లీగ్ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్(RR vs GT) తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది.
ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్(RR vs GT) గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.
దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు 193 పరుగుల భారీ టార్గెట్ ముందుంచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా , డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు.
మొదట్లో వికెట్లు వెంట వెంటనే పడినా ఆ తర్వాత పాండ్యా కుదురు కోవడంతో స్కోరు పరుగులు తీసింది. 52 బంతులు ఆడిన స్కిప్పర్ పాండ్యా 87 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరలో వచ్చిన స్టార్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ 14 బంతులు ఆడి 31 రన్స్ చేశాడు. అభినవ్ సైతం దుమ్ము రేపాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్లలో రియాన్ పరాగ్ , యుజువేంద్ర చహల్ , కుల్దీప్ సేన్ చెరో వికెట్ తీశారు.
ఒకరు రనౌట్ గా వెనుదిరిగారు. ఇదిలా ఉండగా రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 4 మ్యాచ్ లు ఆడి మూడింట్లో గెలుపొందింది ఒక మ్యాచ్ లో ఓటమి పాలైంది.
ఇక గుజరాత్ టైటాన్స్ సైతం నాలుగు మ్యాచ్ లు ఆడి ఒక దానిలో పరాజయం పొందింది. ఇక ఇరు జట్లకు ఈ లీగ్ మ్యాచ్ ముఖ్యం. మరి ఆర్ఆర్ టార్గెట్ చేదిస్తుందో లేదో చూడాలి.
Also Read : పుజారా..రిజ్వాన్ అరుదైన కలయిక