RR vs GT : ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్(RR vs GT )ఘన విజయాన్ని నమోదు చేసింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతుందనుకున్న మ్యాచ్ పేలవమైన రీతిలో ముగిసింది.
ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ఈ మ్యాచ్ ఊర్తిగా గుజరాత్ టైటాన్స్(RR vs GT )స్కిప్పర్ హార్దిక్ పాండ్యాదేనని చెప్పక తప్పదు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ మొదట్లో వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మెస్మరైజ్ ఇన్నింగ్స్ ఆడాడు.
రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడికి తోడు అభినవ్ మనోహర్,
స్టార్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోర్ ముందుంచింది.
అటు బ్యాటింగ్ లో ఇటు ఫీల్డింగ్ లో , మరో వైపు బౌలింగ్ లోనూ సత్తా చాటాడు. తాను అసలైన కెప్టెన్ నని నిరూపించుకున్నాడు పాండ్యా.
అద్భుతమైన బంతికి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ను రనౌట్ చేశాడు.
ఆఖరు లో నీషమ్ ను వెనక్కి పంపించాడు. ఓవర్ ఆల్ గా ఇది వన్ మ్యాన్ షో అని చెప్పాల్సిందే. ఇక బాధ్యతతో ఆడాల్సిన శాంసన్ చేతులెత్తేశాడు.
ఈ గెలుపుతో టాప్ లోకి చేరింది గుజరాత్ టైటాన్స్ . ఏకంగా 37 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. పాండ్యా 87 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి.
అభినవ్ మనోరో 28 బంతుల్లో 43 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. మిల్లర్ 14 బంతులు ఆడి 5 ఫోర్లు ఒక సిక్సర్ తో 31 పరుగులు చేశాడు.
బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ లో మరోసారి జోస్ బట్లర్ ఒక్కడే మెరిశాడు. 9 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది.
బట్లర్ 53 రన్స్ చేస్తే ఇందులో 8 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. దీంతో హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
Also Read : ఆ జట్టు అంచనాలకు అందడం లేదు