Abhinav Manohar : ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో మ్యాచ్ లో ఇద్దరు లేదా ముగ్గురు మెరుస్తున్నారు. తమదైన ఆటతో ఆకట్టుకుంటున్నారు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అంతా తమ మైపు ఔరా అనేలా చేస్తున్నారు. అలాంటి అరుదైన సన్నివేశం ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓ వైపు వికెట్లు పడి పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడాడు. 87 రన్స్ తో సత్తా చాటాడు. ఇదే సమయంలో తన నాయకుడికి తోడుగా మరో ఆటగాడు నిలిచాడు.
అతడే అభినవ్ మనోహర్(Abhinav Manohar). మనోడు ఏకంగా 28 బంతులు ఆడి 4 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. దీంతో పాండ్యా తో కలిసి మెరుగైన భాగస్వామ్యం ఉండేలా చేశాడు.
ఇక అభినవ్ తర్వాత మరో ఆటగాడి గురించి చెప్పాల్సి ఉంటుంది. అతడే స్టార్ హిట్టర్ డేవిడ్ మిల్లర్. క్రీజులోకి వచ్చిన వెంటనే మిల్లర్ దాడి చేయడం ప్రారంభించాడు. కేవలం 14 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.
31 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు ఒక భారీ సిక్స్ ఉంది. మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ కు చుక్కలు చూపించారు ఈ ముగ్గురు.
మొత్తంగా చూస్తే గుజరాత్ టైటాన్స్ మేనేజ్ మెంట్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అభినవ్ మనోహర్.
Also Read : అర్ష్ దీప్ సింగ్ పై సంజయ్ కామెంట్స్