Pak Army : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ దేశ భద్రతపై, అణ్వాయుధాలపై చేసిన కామెంట్స్ పై సీరియస్ గా స్పందించింది పాకిస్తాన్ ఆర్మీ. షెహబాజ్ షరీఫ్ హయాంలో అణ్వాయుధాలు సురక్షితం కాదన్నారు ఇమ్రాన్ ఖాన్.
అమెరికా పన్నిన విదేశీ కుట్రలో భాగంగానే తనను తొలగించారంటూ మాజీ ప్రధాని సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల అవిశ్వాస తీర్మానంలో కేవలం 2 ఓట్ల తేడాతో ప్రధాన మంత్రి పదవిని కోల్పోయారు ఇమ్రాన్ ఖాన్.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని దొంగలు, దోపిడీదారులు అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం కొలువు తీరిన షెహబాజ్ షరీఫ్ సారథ్యంలోని ప్రభుత్వం లో దేశం ఎలా సురక్షితంగా ఉంటుందని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా అనుమానాలు వ్యక్తం చేయడంపై పాకిస్తాన్ ఆర్మీ స్పందించింది. పాకిస్తాన్ సైన్యం(Pak Army )మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తీకర్ ఖాన్ ఆరోపణలను తోసిపుచ్చారు.
ఇటీవల పెషావర్ లో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపాయి.
ఉక్రెయిన్ పై రష్యా దాడి సమయంలో తాను పుతిన్ తో ములాఖత్ కావడం వల్లనే అమెరికా తట్టుకోలేక తనను కుట్ర పన్ని దించేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇమ్రాన్ ఖాన్.
అంతే కాదు అమెరికాపై నిప్పులు చెరిగారు ఇమ్రాన్ ఖాన్. మేము మీకు బానిసలం కాము. ఈ షరీఫ్ లకు, ఈ జర్దారీలకు గులాం కావాల్సిందేనా ఈ దేశం అంటూ ప్రశ్నించారు. ప్రజలు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు.
Also Read : పాకిస్తాన్ సర్కార్ పై ఇక యుద్దం